జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని, ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని.. రూ. 32 కోట్లు విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని, స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్‌లో ట్రెడింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని అన్నారు. 2016 లో ఈడీ, భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా వారు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు. అప్పుడు స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా అన్నారు. అలాగే జగన్, భారతి రెడ్డి తమ షేర్స్ పై సంతకం చేసి.. విజయమ్మ ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని.. షేర్స్ ట్రాన్స్‌ఫర్‌కు, బెయిల్ రద్దుకు సంబధం లేదన్న విషయం తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారని అన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్సీఎల్‌టీలో కేసు ఉంది కాబట్టే.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని.. కొడుకు (జగన్) బెయిల్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మకు తెలుసన్నారు. విజయమ్మ లేఖ తాను రాయకపోతే... ఆ లేఖతో సంబంధం లేదని, అది నేను రాయలేదని, స్వయంగా లేఖను ఖండించే వారు కదా అని వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa