జగన్ సొంత జిల్లాలోనే ఝలక్ తప్పదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే అదే నిజం అయ్యేలా ఉంది అని అంటున్నారు. జగన్ కడప మూడు రోజుల పర్యటనలో జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతల విషయంలో రామసుబ్బారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పిలిచి రాజీ కుదుర్చే యత్నాలు చేశారు.
అయితే సుధీర్ రెడ్డి.. జగన్ చేసిన ప్రతిపాదనలు అంగీకరించలేదని అంటున్నారు. సుధీర్ రెడ్డిని కాదని రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు ఇస్తే మాజీ ఎమ్మెల్యే పార్టీకి ఝలక్ ఇవ్వనున్నట్లు సమాచారం.