‘దీపం 2.0’ పథకం కేవలం వంటింట్లో వెలుగు ఇవ్వడం కోసమే కాదు.. ప్రతి ఒక్కరి కడుపు నింపాలనేదే ప్రధాన లక్ష్యం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జగన్నాథపురంలో మాట్లాడుతూ.. ‘‘ప్రజలు మాపై నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేశారు.
ఓడిపోయి కేవలం 11 సీట్లు వచ్చినా వారి నోళ్లు మూతపడటం లేదు. సామాజిక మాధ్యమాల వేదికగా ఏది పడితే అది మాట్లాడుతాం, చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం’’ అని పవన్ హెచ్చరించారు.