నానాటికి అడుగంటి పోతున్న భూగర్భ జలాల మట్టాన్ని గరిష్ట స్థాయికి పెంపొందించేందుకు గాను అవసరమైన పనులను గుర్తించి వాటిని చేపట్టాలని డ్వామా పిడి బి సుధాకర్ రావు సిబ్బందిని ఆదేశించారు.
శనివారం నరసన్నపేట మండలం తామరపల్లిలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పనులను పిడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటిని అదేవిధంగా వాడుక నీటిని భూగర్భంలోకి ఇంకింపజేయడం ఒక్కటే ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు.