కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో పదవులకు వన్నె తెచ్చి కేంద్ర మంత్రిగా జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి, కృషి చేసిన తెలుగు తేజం కింజరాపు ఎర్రం నాయుడు అని ఆముదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ కొనియాడారు.
ఎర్రం నాయుడు 12వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం శ్రీకాకుళంలోని అరసవిల్లి మిల్లి జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.