ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మరణించారు. ఈ ప్రమాదంలో కారు ముక్కలుముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు కంటైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.కాంట్ ప్రాంతంలోని ఓఎన్‌జీసీ చౌక్ సమీపంలో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు కంటైనర్‌ను, ఆపై చెట్టును ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు కిషన్‌నగర్ చౌక్‌కు చెందినది. ఓఎన్‌జీసీ చౌక్ వద్ద వేగంగా వచ్చిన కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొనడంతో కారు బానెట్ కంటైనర్ వెనుక ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కారు రాంగ్ డైరెక్షన్‌లో 100 మీటర్ల దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కొందరి శరీరాలు ముక్కలయ్యాయి. మృతులను గునీత్(19), కునాల్(23), నవ్య గోయల్(23), అతుల్ అగర్వాల్(24), రిషవ్ జైన్(20)గా గుర్తించారు. సిద్ధేష్ అగర్వాల్(25) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.