మహిళలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హెచ్చరించారు. దురాచారాలు, వేధింపులు మహిళలపై ఎక్కువ అవుతున్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు తెలిపారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్లో చాలా అంశాలపై మాట్లాడినట్లు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్లపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని వివరించారు. ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైంలో కేసులు పెడతామని హెచ్చరించారు. సిడ్నీలో జరిగిన కామన్ వెల్త్ సమావేశంలో భారత్ ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.