బాలికలకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. మంగళవారం ఆదోని జీఎస్‌ఆర్ రెసిడెన్షియల్ హైస్కూల్ మైదానంలో ఆదోని జోన్ లెవెల్ బాలికలతో త్రో బాల్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఎస్పీ సోమన్న జ్యోతి ప్రజ్వలను చేసి క్రీడలను ప్రారంభించారు.
అనతరం సబ్ కలెక్టర్ క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడలు విద్యార్థులకు క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని అన్నారు. నేడు క్రీడలకు దూరమై సెల్ ఫోన్లకే పరిమతమవుతు న్నారని అన్నారు. తల్లిదండ్రులు చదువుపైనే ఒత్తిడి చేస్తున్నారని, క్రీడలను ప్రోత్సహించడం లేదన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమన్నారు. పాఠశాల అధినేత గోపాల్ రెడ్డి, హెచ్‌ఎం సత్య శ్రీ, విజయ్ కుమార్, ఎంఈవో రాజేంద్రప్రసాద్, పీఈటీలు నరసయ్య, నరసింహులు, ఖలీల్ పాల్గొన్నారు.