ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఏపీ శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సోమవారం వాదోపవాదాలు కొనసాగాయి. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో ఇచ్చిన సమాధానంపై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదేపదే ప్రశ్నలు వేశారు. దీంతో బొత్స సత్యనారాయణకు మంత్రి నాదెండ్ల మనోహర్ , పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం తెచ్చినందుకు వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారంటూ మంత్రి మనోహర్ మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 30 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa