AP: స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్‌పైనే వంశీ అనే యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తోటి స్నేహితులు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు బెంగళూరు అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు.