ఢిల్లీ : విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఢిల్లీలో హత్యకు గురైయ్యారు. ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా పోలీసు కానిస్టేబుల్ కిరణ్ పాల్(28) ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారని ఒక అధికారి తెలిపారు.గోవింద్‌పురి పోలీస్ స్టేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు.