గత ఐదేళ్లలో వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బ తీశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కె. రామ్మోహన్ నాయుడు. గత సీఎం వైఎస్ జగన్ చర్యల వల్ల.. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలి పోయాయన్నారు.బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ తీసుకు వస్తామన్నారు. ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్.. ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్‌కు కేంద్ర సహకారం అవసరమన్నారు. పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా చేసుకుని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఎలా తీసుకు రావాలనేది ఒక డాక్యుమెంట్‌తో తాము ముందుకు వెళ్తున్నామన్నారు.