సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా పోస్టుల కేసులపై పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 15 మందికి 41ఏ నోటీసులు జారీచేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కీలక నిందితులు భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డిలతో పాటు మరో13 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.