ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్‌లో అరెస్టు చేయడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఆయన అరెస్టు, బెయిల్ నిరాకరణ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశామని వెల్లడించింది. ఈ విషయంపై బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొంది. హిందువులు, మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను భారత విదేశాంగశాఖ కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa