కాకుమాను మండలం చిన్న లింగాయపాలెం గ్రామంలో మంగళవారం వరి కోతల విధానాన్ని ధాన్యం కల్లాలను జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ , సివిల్ సప్లయిస్ డి ఎం జి లక్ష్మీ పరిశీలించారు.
కొనుగోలు చేసిన ధాన్యమును పరిశీలించి కొనుగోలు కేంద్రంలోని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సిబ్బంది అందుబాటులో ఉండాలని వారు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులకు వివరించారు.