ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో విజయపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత గుంటూరుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రఘురామ కేసులో మంగళవారం విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం రాత్రి 9 గంటలకు అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విజయపాల్ ఉన్నారు.