అదానీని అరెస్టు చేయాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకులు ఎం సత్యన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మూడోసారి అధికారంలో వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఐఎ్ఫటీయూ నాయకులు బాలరాజు, బాబు, ఎల్లప్ప, నరసింహులు పాల్గొన్నారు.