సెకీతో విద్యుత్ ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీ తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. రాయలసీమలో ఫ్లై యాష్‌ను సొమ్ము చేసుకునేందుకు కడప, అనంతపురానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఘర్షణ పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి అంటూ మళ్లీ టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు.