అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి గురువారం ఎగువ ప్రాంతాల నుంచి 3, 026 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు జలాశయం అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 77. 988 టిఎంసిలు కాగా ప్రస్తుతం జలాశయంలో 70. 011 టీఎంసీల నీటిమట్టం నమోదయింది. పెన్నా డెల్టాకు 50 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 400 క్యూసెక్కులు, కావలి కాలువకు 50 క్యూసెక్కులు, కండలేరుకు 6, 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.