ఆనందపురం మండలం వేములవలస ఎస్సీ కాలనీలో గల అంబేడ్కర్ విగ్రహానికి వేసిన పూలమాలలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ మోర్చా నేత ఉప్పాడ అప్పారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు రాంబాబు, సన్నిబాబు, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.