యలమంచిలి మండలం జంపపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన యల్లపు వెంకట సూరి అప్పారావు కుటుంబ సభ్యుల సౌజన్యంతో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ దేవకీ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.