ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన దారుణ సంఘటన వెలుగు చూసింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఓ యువకుడు వెంటపడేవాడు. అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. విద్యార్తిని లహరి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడుఅనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో చనిపోయినట్లు తెలుస్తుండగా.. ఘటనకు సంబంధించిన విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.