ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యూజియం నుండి నేతాజీ టోపీ మాయం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:18 PM

దేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధరించిన టోపీ ఢిల్లీలోని ఎర్రకోటలో ఉన్న నేతాజీ మ్యూజియం నుంచి ఈ మాయమైందని, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని ఆయన మనవడు, బీజేపీ మాజీ నేత చంద్రకుమార్ బోస్ డిమాండ్ చేశారు.గురువారం 'ఎక్స్' వేదికగా చంద్రకుమార్ బోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2019 జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా తాము కుటుంబసభ్యులతో కలిసి ఈ టోపీని స్వయంగా ప్రధాని మోదీకి అందించామని గుర్తుచేశారు. ఆ టోపీని ప్రధాని ఎర్రకోటలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారని తెలిపారు.ఇటీవల తమ సహచరుడు ఒకరు మ్యూజియంను సందర్శించగా టోపీని ఉంచిన గ్లాస్ బాక్స్ ఖాళీగా కనిపించిందని ఆయన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై అక్కడి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత నాయకుడికి సంబంధించిన చారిత్రక వస్తువు అదృశ్యం కావడం అత్యంత అవమానకరమని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa