ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేదరమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 13, 2026, 12:45 PM

కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఒంగోలు రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అద్దంకి నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. కొప్పెరపాడుకు చెందిన దేవ కుమారి అనే ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. మొత్తం 31 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. గాయపడిన మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa