ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈనెల 20న సింహాద్రి నాథుడి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో జే వెంకట్రావు ఆధ్వర్యంలో వేగంగా పూర్తి చేస్తున్నారు. సోమవారం వైశాఖ మాసం ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజల అనంతరం తొలి విడతగా చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa