AP: వేసవి సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో నిమ్మకాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల కేజీ రూ.30గా ఉన్న నిమ్మ ధర ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి రూ.130 నుంచి 135 పలుకుతోంది. అయితే రేట్లు పెరిగినా వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎకరాకు 40 బస్తాలు వచ్చేదని, ఇప్పుడు 15 బస్తాలు కూడా రావడం లేదని వాపోతున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa