అడిగొప్పలలోని శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవస్థానంలో గురువారం హుండీ ఆదాయ లెక్కింపు జరిగింది. ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. గత 51 రోజుల్లో భక్తులు సమర్పించిన విరాళాలు మొత్తం రూ. 26,72,462గా నమోదైనట్లు దేవస్థానం ఈవో ఆదిశేషనాయుడు తెలిపారు. ఈ లెక్కింపు ప్రక్రియను కారంపూడి గ్రూపు దేవాలయాల ఈవో హనుమంతరావు పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa