జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-3లో మంగళవారం బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 48వ వార్డు మాజీ కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, రాజ్యాంగం ద్వారా ఆయన అన్ని వర్గాల వారికి సమన్యాయం చేకూర్చారని కవిత యాదవ్ కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa