విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్ర(21) అనే యువకుడు రూ.2 వేల లోన్ తీసుకున్నాడు. యువకుడు లోన్ చెల్లించకపోవడంతో ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాదు లోన్ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ ఫోటోలను బంధువులకు పంపించడంతో తీవ్ర మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లైన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.