కురుపాం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికీ పక్కా రహదారి సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. కొమరాడ మండలంలోని రామభద్రపురం - అల్లువాడ రహదారి పనులకు ఆమె మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఉలిపిరి, చోళ్లపధం గ్రామ సచివాలయాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికీ పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ మండల కన్వీనర్ ఉదయశేఖర్ పాత్రుడు ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరేశ్ చంద్రదేవ్, జి.సుదర్శనరావు, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూదనరావు, కురుపాం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కె.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.