కడప - చెన్నై జాతీయ రహదారిపై ఒంటిమిట్ట బస్టాండ్ వద్ద ఆవులు అడ్డంగా ఉండడం వల్ల ప్రయాణికులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండులో బస్సులు కనబడతాయి కానీ ఒంటిమిట్ట బస్టాండులో ఆవులు కనపడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదండ రామస్వామి ఆలయానికి, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఆవుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు