పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని.. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గుర్తుచేశారు. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరించిందని వెల్లడించారు. అలాగే కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందపరించిందన్నారు. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయన్నారు. ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయిందని వ్యాఖ్యలు చేశారు.