గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో శనివారం జరిగిన ఊర చెరువు నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో విజినిగిరి పాపినాయుడు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.
ఉపాధ్యక్షునిగా శనపతి అప్పలనాయుడు ఎంపికయ్యారు. డైరెక్టర్లుగా దాసరి సత్యం, తోలాపు అప్పలనాయుడు, విజినిగిరి నారాయణ, విజినిగిరి అల్లం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థులు సభ్యులందరూ ఏకగ్రీవ ఎన్నికలపై సంతృప్తి వ్యక్తం చేశారు.