ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు... ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. చంద్రబాబు భేటీలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దేవినేని ఉమా, చినరాజప్ప, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.
అంతకుముందుకు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.సౌర విద్యుత్ ఒప్పందాలలో లోపాలపై సీపీఐ తరపున హైకోర్టులో తాను ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయగా, నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మరో పిటిషన్ వేశారన్నారు. కోర్టులో వేసిన పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం, 2024 అక్టోబర్ నాటికి అందాల్సిన 3000 మెగావాట్ల సౌర విద్యుత్ అందకపోవటం, అదానీ అవినీతి ఆరోపణల దృష్ట్యా సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నానని సీపీఐ నేత రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.