ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో అరుదైన నాగుపాము.. ఎల్లో కలర్‌లో ప్రత్యక్షమైన పాము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 06:26 PM

తిరుమలలో అరుదుగా కనిపించే నాగుపాము ప్రత్యక్షమైంది. పచ్చ రంగులో ఉండే ఈ నాగుపామును అందరూ ఆశ్చర్యపోయారు. కొండపై ఆదిశేషు అతిథి గృహం దగ్గర ఓ చెట్టులో దాదాపు మూడున్నర అడుగుల పొడవు గల ఈ నాగుపాము కనింపించింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే టీటీడీ స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని నాగుపామును జాగ్రత్తగా పట్టుకొని.. అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.


ఈ పచ్చ నాగపాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.. ఇవి ఆకుపచ్చ, లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ నాగుపాములు ఎక్కువగా చెట్లు, పొదల్లో కనిపిస్తుంటాయి. ఈ పాములు కీటకాలు, చిన్న సాలె పురుగుల్ని తిని జీవిస్తుంటాయి. ఈ పాములు మృదువుగా, సన్నగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పచ్చగా ఉండటం వల్ల చెట్లపై ఉన్నప్పుడు.. ఆకులలో దాక్కుని ఉన్నప్పుడు గుర్తించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఈ నాగుపాములు ఎక్కువగా తేమ ఉండే అడవులు, తోటలు, పొలాలు, చెట్లపై ఉంటాయని.. విషపూరితమైనదనట. తిరుమలలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది వీడియోలు తీయడంతో వైరల్ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa