ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండేళ్లుగా 'రంజాన్ తోఫా' ఎందుకు అమలు చేయడంలేదు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 03:49 PM

పేద ముస్లింలకు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇస్తానన్న 'రంజాన్ తోఫా' ఏదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 'చంద్రన్న తోఫా' ఇస్తామని చెప్పి, రెండేళ్లుగా ఎందుకు అమలు చేయడం లేదని ఆమె నిలదీశారు.ఈ సందర్భంగా షర్మిల సోషల్ మీడియాలో స్పందిస్తూ... "రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వానికి, 12 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు తోఫా ఇవ్వడానికి అవసరమైన రూ.65 కోట్లు బరువయ్యాయా?" అని విమర్శించారు. గతంలో తోఫా ఇవ్వనందుకు జగన్‌కు ముస్లింలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో ఆలోచించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వం చెబుతున్న మైనారిటీ సంక్షేమం అంతా బూటకమని షర్మిల ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa