టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. భారత జట్టు ఈ విజయంతో మూడు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన తొలి జట్టుగా చారిత్రక రికార్డును నెలకొల్పింది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, జట్టు పుంజుకున్న తీరు వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు తెర వెనుక జరిగిన ప్రయత్నాలను వివరించాడు. "ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ప్రాక్టీస్ సెషన్లలో అత్యుత్తమ ఫీల్డర్‌కు రూ.10,000 నగదు బహుమతిని ప్రవేశపెట్టారు. ఇది ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే, సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత మా వీడియో అనలిస్ట్ గత రెండేళ్ల ప్రదర్శనతో కూడిన పది నిమిషాల వీడియోను చూపించారు. బ్యాటర్ల కోసం బాహుబలి పాటతో, బౌలర్ల కోసం 'ఓ షేరా తీర్ తే తాజ్' పాటతో ఆ వీడియోలను రూపొందించారు. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జట్టును మరింత బలోపేతం చేస్తాయి" అని సూర్య తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa