కేంద్రం ప్రకటించిన పీఎం కిసాన్ పధకంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, పథకాన్ని అమలు చేయకుండా రైతులను నిండా ముంచేశాడని వైయస్ఆర్‌సీపీ వ్యవసాయం, రైతు సంక్షేమం ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకానికి మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టిన చంద్రబాబు రెండో ఏడాది మార్చి నెల వచ్చినా మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నాడని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నుంచి ప్రధాని చేతుల మీదుగా 13వ తేదీన పీఎం కిసాన్ కింద 22వ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటన వచ్చినా ఎక్కడా అన్నదాత సుఖీభవ ప్రస్తావన లేదన్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేశామని కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 46.86 లక్షల మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తోందని ఆక్షేపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa