తిరుపతిలో ఇవాళ(మంగళవారం) ఉదయం బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయ్యాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. చిత్తూరు-2 డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. ముందు వెళుతున్న బుల్డోజర్‌ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa