వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగలుతోంది. సోషల్ మీడియాను యాక్టివేట్ చేయాలని అనుకున్న మాజీ సీఎం జగన్‌కు ప్రతినిధులు కరువయ్యారు. ఇప్పటి వరకు ఉన్న వారు కూడా కేసుల్లో ఇరుక్కోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
వైసీపీ సోషల్ మీడియాలో పని చేసేందుకు కార్యకర్తలు సైతం బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏ కామెంట్ చేస్తే ఏ కేసు వెంటాడుతుందోనన్న భయంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.