వైయస్ఆర్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో వైయస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేక్ కట్ చేసి సందడి చేసిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులు.. పెద్ద ఎత్తున రక్తదానశిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ సేవాకార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు.