పల్నాడు జిల్లా అద్దంకి- నార్కట్‌పల్లి హైవేపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. దాచేపల్లి వద్ద ట్రావెల్ బస్సు దూసుకెళ్లి 150 గొర్రెలు మృతి చెందిన ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలతో మంత్రి గొట్టిపాటి ఫోన్లో మాట్లాడారు. గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు.