రంపచోడవరం డివిజన్ లో గడచిన 24 గంటల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారి దివాకర్ బుధవారం వెల్లడించారు. అత్య ధికంగా మారేడుమిల్లి మండలంలో 4.8 మి.మీ, ఎటపాకలో 3, కూనవరం, వై.రామవరం, అడ్డతీగల, వి.ఆర్.పురం మండలాల్లో 2.2 మి.మీ, చింతూరులో 1.8 మి.మీ, రాజవొమ్మంగి 1.2, గంగవరం, రంప 0.8 మి.మీ, దేవీపట్నంలో 0.6 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.