సీఎం చంద్రబాబుకు బీజేపీ చెక్ పెట్టేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని స్థానిక నేతలకు బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రెండేళ్లలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని మార్చేలా కృషి చేయాలని అధిష్టానం సూచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేనతో మరింత బంధం పెంచుకుని దశల వారీగా బలం పుంజుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.