కాకర నాటిన 40 నుండి 45 రోజుల మధ్యలో పూతకు వస్తుంది. మొదటి కోత 55 నుంచి 60 రోజులకు వస్తుంది. తీగలను పందిరి పైకి పాకనిస్తే కాయ దిగుబడి పెరుగుతుంది. పండు ఈగ నివారణకు ‘కుకుర్ ల్యూర్’ను వినియోగించాలి. ఒక ల్యూర్ ధర రూ.35 నుంచి రూ.40 దాకా ఉంటుంది. ఎకరానికి ఎనిమిది నుంచి పది ల్యూర్‌లను వాడాలి. బూడిద తెగులు నివారణ కోసం లీటరు నీటిలో 5 మి.లీ డైనోకాప్ లేదా 0.5 గ్రా. మైక్లోబ్యుటానిల్ కలిపి పిచికారీ చేయాలి.