పైనాపిల్‌ను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. పైనాపిల్‌లో ఉండే 'సి' విటమిన్ మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగితే పచ్చకామెర్లు, కాలేయ వ్యాధులు దరిచేరవు. పైనాపిల్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.పైనాపిల్లోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.పైనాపిల్‌లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది.