కజకిస్తాన్‌లో మంచు తుఫాను కారణంగా సుమారుగా 100 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రాంతంలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు కజకిస్తాన్‌లోని బిర్జాన్ సాల్ జిల్లా కోగామ్ మరియు కరటల్ గ్రామాల మధ్య ఈ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు తుఫాను జరిగిన ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వసమయ్యాయి. దీంతో వాహనాలన్నీ రోడ్డు మీదే నిలిచిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa