రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు నిధులను జీవో 17 ద్వారా దారిమళ్లించి బోర్డును నిర్వీర్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 46వేల పెండింగ్ క్లెయిములకు నిధులు మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa