తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. సీడ్ యాక్సిస్ రోడ్డుపై కార్,కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, కారు ఎదురు భాగం దెబ్బతినగా ఆటో స్వల్పంగా దెబ్బతిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల వివరాలు నమోదు చేసుకున్నారు.