భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నిర్వహించిన నరెడ్కో ప్రాపెర్టీ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడూ చూడనివిధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే దీనికి ముఖ్య కారణం. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంతమంది నష్టపోయారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.